‘చెకుముకి’తో విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానం
● డీసీపీ రాజామహేంద్ర నాయక్
జనగామ రూరల్: సమాజంలో మూఢవిశ్వాసాలను పారదోలడంలో, విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించడంలో జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయమని డీసీపీ రాజామహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏకశిలా బీఎడ్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు రవీందర్ అధ్యక్షతన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్షాన్ని ఎంచుకుని అది సాధించే వరకు విశ్రమించకుండా ,ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని 30 టీమ్స్ పాల్గొని తమ ప్రతిభను కనపరిచాయని 4 టీమ్స్ కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమంలో ఽజెడ్పీఎస్‌ఎస్ ధర్మకంచ పాఠశాల ప్రభుత్వ తెలుగు మాధ్యమం జెడ్పీఎస్‌ఎస్ లింగాలఘణపురం, ప్రభుత్వ గురుకుల ఆంగ్ల మాధ్యమం, ఎంజేపీ మొండ్రాయి ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమం, సాన్ మరియా పాఠశాల ఎంపికయ్యాయి. కార్యక్రమంలో గంట రవీందర్, శ్రీనాథ్, రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఉమాదేవి, లక్ష్మణ్, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
నామినేషన్ల కేంద్రాల సందర్శన
రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి, రఘునాథపల్లి నామినేషన్ల కేంద్రాలను డీసీపీ రాజమహేంద్రనాయక్ శుక్రవారం సందర్శించారు. అయా నామినేషన్ల కేంద్రాలవద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఆయన వెంట ఎస్సై దూదిమెట్ల నరేశ్, ఏఎస్సై బత్తిని కట్టమల్లు తదితరులు ఉన్నారు.


