కేటీఆర్‌వి అహంకారపు మాటలు
స్టేషన్‌ఘన్‌పూర్: అహంకారం మాటలతో ఎవరూ పెద్ద నాయకులు కాలేరని మాజీమంత్రి కేటీఆర్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. కేటీఆర్ సభ్యత, సంస్కారం మరిచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేటీఆర్‌లాగా అయ్యపేరు చెప్పుకుని, కుటుంబం పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదని, స్వతంత్రంగా రాజకీయాల్లో ఎదిగానని స్పష్టం చేశారు. నీతి, నైతికత, విలువల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఎంతమాత్రం లేదని, బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని అందులో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చెల్లెలు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, ముందు తన చెల్లికి సమాధానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లేనిరోజున బీఆర్‌ఎస్ పార్టీ ముక్కలు, చెక్కలవుతుందని, కేటీఆర్ నాయకత్వం నచ్చకనే హరీశ్‌రావు దూరంగా ఉంటున్నారని, కేసీఆర్ తర్వాత ఆయన తనదారి తాను చూసుకుంటారన్నారు. కేటీఆర్‌పై ఇప్పటికే పది కేసులున్నాయని, ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, నాయకులు అన్నం బ్రహ్మారెడ్డి, కరుణాకర్‌రావు, కొలిపాక సతీష్, తెల్లాకుల రామకృష్ణ, చింత ఎల్లయ్య, మంద రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం మండిపాటు


