సంబురంగా దీపావళి
న్యూస్‌రీల్
– మరిన్ని ఫొటోలు 9లోu
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జనగామ: చీకటిని పారదోలి ఆశలు వెలిగించే దీపావళి పర్వదినాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా సంబురంగా జరుపుకున్నారు. పట్టణం, పల్లెల్లో దీపావళి పండుగ ప్రత్యేకమైన శోభ కనిపించింది. పండుగను పురస్కరించుకుని సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు లక్ష్మీదేవిని పూజించారు. వ్యాపా ర సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు, ఇళ్లలో నూ ధనసమృద్ధి కలిగించే తల్లీ, అష్టైశ్వర్యాల మాతా వరమివ్వు అంటూ అమ్మవారిని కొలిచా రు. నైవేద్యాల సువాసనలు, గంధపు, చందనపు పరిమళాలు వాతావరణాన్ని భక్తిరసపూరితం చేశాయి.
మార్మోగిన పటాకుల శబ్దాలు
దీపావళి హారతులు, కేదారీశ్వర నోములు, లక్ష్మీపూజలను ముగించుకున్న తర్వాత రాత్రివేళల టపాసుల మోతతో ఆకాశం వెలుగులతో నిండిపోయింది. చిచ్చుబుడ్ల శబ్దాలు, రాకెట్ల మెరుపులు, భూచక్రాల సవ్వడితో చిన్నారులు మురిసిపోయారు. పటాకుల కాంతుల్లో ప్రకాశించిన జిల్లా ఈసారి కూడా ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పోలీస్, మున్సిపల్, ఫైర్ శాఖలు పటిష్ట ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో వేడుకలు సజావుగా ముగిశాయి.
‘ఫలం’ దక్కట్లే
భక్తిభావంతో లక్ష్మీపూజలు, కేదారీశ్వర వ్రతాలు
విరజిమ్మిన బాణసంచా వెలుగులు
సంబురంగా దీపావళి


