అక్రమాలు జరగకుండా చూడాలి
బచ్చన్నపేట: జాతీయ గ్రామీణ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరగకుండా చూడాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీఆర్‌డీఓ చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ని ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ పథకం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మండలంలోని 26 గ్రామాల్లో బృంద సభ్యులు తనిఖీ చేసిన వివరాలను ప్రజావేదికలో తెలిపారు. దస్తావేజుల నిర్వహణ లేదని మస్టర్లలో అధికారులు సంతకాలు చేయకుండానే వేలల్లో బిల్లులను చెల్లించారని ఆడిట్ సిబ్బంది వివరించారు. ఆయా గ్రామాల వారీగా రికవరీ బిల్లుల వివరాలను అందించామని సంబంధిత అధికారులు తిరిగి చెల్లించాలని లేని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీఓ మమతాబాయ్, ఎంపీఓ వెంకటమల్లికార్జున్ పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్‌డీఓ చంద్రశేఖర్


