వ్యక్తుల ప్రాధాన్యం కన్నా పాఠశాలలే ముఖ్యం..
జిల్లాలో ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చిన తదుపరి ప్రాథమిక పాఠశాలలు, హైస్కూల్స్‌లో జాయిన్ కాకపోవడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను సర్దుబాటు చేయడం ద్వారా పాఠశాల వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని సర్దుబాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో సర్దుబాటుకు సంబంధించి ఒక డ్రాఫ్ట్‌ను కోరిన సమయంలో జిల్లా అధికారులు తమకు అందజేశారు. నిబంధనల మేరకు ముందుగా కాంప్లెక్స్ పరిధిలో సర్దుబాటు చేయాలి. తదుపరి ఒక కాంప్లెక్స్ నుంచి పక్క కాంప్లెక్స్, మిగులు ఉపాధ్యాయులు ఉంటే మండలంలో ఎక్కడికై నా, ఆ మండలంలోనే మిగులుగా ఉంటే పక్క మండలానికి పంపించాలి. పక్కనున్న మండలంలో కూడా అవసరం లేకుంటే జిల్లాలో ఎక్కడికై నా సర్దుబాటు చేయవచ్చు. సర్దుబాటు డ్రాఫ్ట్‌ను చూసిన తర్వాత, అందులో తగు మార్పులు, చేర్పులు చేయాల్సిందిగా మండల విద్యాధికారిని కోరాం. మేము చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు వెలువడుతాయని భావిస్తున్నాం.
– పి.చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్‌యూటీఎఫ్


