నేటి నుంచి నిట్‌లో టెక్ ఫెస్ట్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–2 ఈనెల 24 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ ఈ ఏడాది రెండు రోజులు శుక్ర, శనివారాల్లో నిర్వహించేందుకు నిర్ణయించారు. శుక్రవారం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్ మాధవీలత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు మెకా వెహికిల్ ఎగ్జిబిషన్, నియాన్ క్రికెట్, కిట్ అసెంబ్లీ, సుమో వార్, డ్యాన్స్ ఓ, వరంగల్ రింగ్ వంటి వివిధ రకాల స్పాట్ లైట్, సెమినార్స్‌తో అలరించనుంది. కాగా, టెక్‌ఫెస్ట్–25లో దేశవ్యాప్త వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.


