పాలకుర్తిలో చిల్లర కాంటా దుకాణాలపై దాడులు
సాక్షిలో చిల్లర కాంటాల దందా పేరిట వచ్చిన కథనంపై మార్కెట్, మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా దాడులు చేపట్టారు. పాలకుర్తిలో ఐదు చిల్లర కాంటా దుకాణాలపై దాడులు చేశారు. ఇందులో ఐదు దుకాణాలకు నోటీసులు జారీ చేసి, ట్రేడ్ లైసెన్స్ పొందే వరకు క్రయ, విక్రయాలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎం నరేంద్ర హెచ్చరించారు. ఇదిలాఉండగా జనగామ పట్టణంతో పాటు లింగాలఘణపురం, నెల్లుట్ల రూట్‌తో పాటు రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, నర్మెట తదితర మండలాలు, మేజర్ గ్రామాల పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా చిల్లర కాంటా దుకాణాలను నడిపిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారనే ప్రచారం నేపథ్యంలో అధికారులు నిఘా వేశారు.


