సిద్ధేశ్వరాలయంలో ఘనంగా పూజలు
బచ్చన్నపేట : మండలంలోని కొడవటూర్‌లోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ కావడం, అలాగే గౌరీ వ్రతాలను నోముకున్న వారంతా ఆలయానికి రావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే మహిళలు ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. కార్యక్రమంలో ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రధాన అర్చకులు ఓం నమఃశివాయ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అయోడిన్ ఉప్పు వాడకంపై
అవగాహన ఉండాలి
బచ్చన్నపేట: మనిషి జీవనానికి అత్యంత ఉపయోగకరమైన అయోడిన్ ఉప్పు వాడకంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌ఓ కె.మల్లికార్జున్‌రావు అన్నారు. మంగళవారం పెంబర్తి గ్రామంలోని బచ్చన్నపేట ఎంజేపీటీసీ వెల్ఫేర్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఆర్‌బీఎస్‌కే బృందం విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య పరిశీలన, వారి ఎత్తును, బరువును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో రక్తహీనత నిర్మూలనకు అనీమియా పరీక్షలపై దృష్టి సారించాలన్నారు. గ్లోబల్ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కళాశాలను సందర్శించామన్నారు. అయోడైజ్డ్ ఉప్పు వినియోగం తప్పనిసరి అని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
‘కపాస్’ యాప్ అమలును వెనక్కి తీసుకోవాలి
జనగామ రూరల్: కపాస్ కిసాన్ యాప్ అమలు వెనక్కి తీసుకోని విరివిగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించటానికి ఈనెల 25న జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో జరిగే పత్తి రైతుల రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ.7,710గా నిర్ణయించింది. కానీ, నేటికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు తెరవలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ భూక్య చందు నాయక్, జిల్లా బాధ్యులు మంగ బీరయ్య, నాయకులు కర్రే రాములు, భీరయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపటి వరకు మద్యం దుకాణాలకు టెండర్లు
జనగామ: మద్యం దుకాణాలకు 2025–2027 సంవత్సరాలకు గాను ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వడ్లకొండ రోడ్డు ఎకై ్సజ్ జిల్లా కార్యాలయంలో 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రోడ్డు పెంబర్తిలోని నందన గార్డెన్‌లో మద్యం దకాణాల కేటాయింపులకు లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రోడ్డే కల్లం..
పాలకుర్తి టౌన్ : పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవటానికి కల్లాల కొరతతో ఏటా రైతులు రోడ్లనే అశ్రయిస్తున్నారు. రహదారులపై ధాన్యపు రాశులు పోయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పాలకుర్తి మండలంలో మక్కలతో పాటు వరికోత ప్రారంభం కావటంతో బమ్మెర పెద్దతండా, చెన్నూరు, వావిలాల, ముత్తారం, శాతపురం వరకు గ్రామాల రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. రహదారి పొడవునా వరి ధాన్యం, మక్కలు నిల్వ చేస్తున్నారు. రోడ్లపైనే ధాన్యం పోయడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
సిద్ధేశ్వరాలయంలో ఘనంగా పూజలు


