రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయస్థాయిలో అమలవుతున్న జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్(ప్యాడీ), జాతీయ నూనెగింజల మిషన్(గ్రౌండ్‌నట్) రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతీ గింజకు విలువ దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, మార్కెట్ చైర్‌పర్సన్ లవుడ్యా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కమ్మగాని నాగన్న పాల్గొన్నారు.
కొడకండ్ల : రైతుల సంక్షేమమే ధ్యేయంగా వినూత్న పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహారభద్రత, పోషణ మిషన్, జాతీయ నూనెగింజల మిషన్ ద్వారా రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఏఓ అంబికాసోని, ఏడీఎ పర్శరామ్‌నాయక్, వ్యవసాయాధికారి విజయ్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్‌నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, డైరెక్టర్లు పాల్గొన్నారు.
వారం రోజుల్లో పూర్తిచేయండి: కలెక్టర్
పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీసోమేశ్వర ఆలయం కల్యాణ మండపం పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అఽధికారులను అదేశించారు. మండల కేంద్రంలో కల్యాణ మండపాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి, సాదాబైనామాలను పరిశీలించారు.


