
మిగిలింది మూడు రోజులే!
83 దరఖాస్తులే..
ఆశాభావంలో ఎకై ్సజ్ శాఖ
సర్కిల్ వారీగా టెండర్లు
జనగామ: జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ ఊహించని విధంగా మందగమనం దిశగా సాగుతోంది. టెండర్ దాఖలు గడువు ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా, ఇప్పటివరకు జిల్లాలో టెండర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంది. గత సీజన్‌న్‌లో సుమారు 2,500 వరకు టెండర్లు దాఖలైన చోట, ఈసారి 100 దాటలేని పరిస్థితి ఎకై ్సజ్ శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
టెండర్ ఫీజు పెంపు ప్రభావం
టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం మద్యం వ్యాపారులకు పెద్ద అడ్డంకిగా మారింది. గతంలో ఫీజు తక్కువగా ఉండటంతో చిన్నస్థాయి వ్యాపారులు, స్థానిక పెట్టుబడిదారులు కూడా పోటీలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు భారీ మొత్తంలో డిపాజిట్ పెట్టాల్సి రావడంతో చాలామంది వెనక్కి తగ్గారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిన నేపథ్యంలో లిక్కర్ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తున్నారు.
తగ్గిన వైన్స్ అమ్మకాలు
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, చాలా చోట్ల వైన్స్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు, వ్యయ నియంత్రణ, ఆర్థిక మందగమనం వంటి అంశాలు అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిలో కొత్త లైసెన్సుల కోసం ముందుకు వచ్చే వ్యాపారులు తగ్గిపోవడం సహజమేనంటూ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు.
టెండర్‌దారులకు ఫోన్లు చేస్తున్న అధికారులు
టెండర్లు దాఖలు చేయడం తగ్గిపోవడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వయంగా పాత టెండర్‌దారులకు ఫోన్‌న్లు చేసి దరఖాస్తులు వేయమని అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. జిల్లాస్థాయిలో కూడా శాఖ అధి కారులు మద్యం వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూ టెండర్‌లో పాల్గొనే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ వ్యాపారుల ఎంట్రీ
ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది టెండర్ దారులు తెలంగాణ మార్కెట్‌లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో లైసెన్సింగ్ విధానం కొంత సాఫీగా ఉండటం, కొన్ని పట్టణాల్లో వ్యాపార అవకాశాలు మెరు గ్గా కనిపించడం కారణంతో ఉత్సాహంగా ఉన్నట్లు ప్రచారం జరు గుతుంది. ఏపీలోని బడా వ్యాపారులు ఎంట్రీ అవుతున్నారనే ప్రచారం నేపథ్యంలో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
గత సీజన్ ఉత్సాహం కనిపించడం లేదు
గత సీజన్‌లో మద్యం దుకాణాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో షాపునకు పదికిపైగా టెండర్లు వేశారు. కానీ ఈసారి ఆ ఉత్సాహం కనిపించడం లేదు. వడ్డీరేట్లు పెరగడం, అనేక చోట్ల లిక్కర్ విక్రయాలే తగ్గడం, రియల్ ఎస్టేట్ మందగమనం అనేక కారణాలతో టెండర్లపై ప్రభావం చూపిస్తోందని మాట్లాడుకోవడం గమనార్హం.
మున్సిపాలిటీల్లో నిబంధనలు సడలింపు
పురపాలిక(మున్సిపల్) పరిధిలో మద్యం దుకాణాలకు సంబంధించిన నిబంధనలకు ఎకై ్సజ్ శాఖ అధికారులు సడలించారు. మున్సిపల్ లిమి ట్స్‌లో వైన్స్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో వార్డు నెంబర్ల ఆధారంగా లక్కీ లాటరీలో వచ్చిన విధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు. నిబంధనల సడలింపు వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం. ఇదిలా ఉండగా చలాన్‌లో సైతం జిల్లా పేరు తీసి వేయడంతో ఒక్క చలాన్‌తో రాష్ట్రంలో ఎక్కడైనా వేసుకునే అవకాశం కల్పించారు.
జిల్లాలో 50 మద్యం దుకాణాలకుగాను టెండర్లను స్వీకరిస్తున్నారు. గతనెల 26వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేసన్ విడుదల కాగా, ఈనెల 18వ తేదీతో గడువు ముగియనుంది. 2023–25 సంవత్సరంలో జిల్లాలో 2,492 దరఖాస్తులు రాగా, రూ.50కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈసారి జరిగే 2025–27 రెండేళ్ల కాలపరిమితిలో టెండర్లలో 3వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎకై ్సజ్ శాఖ అంచనాలు వేసుకుంది. టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసి 20 రోజులు గడిచిపోతున్నా, జిల్లాలో కేవలం 83 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో జనగామ సర్కిల్‌లో 38, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 27, పాలకుర్తిలో 18 మంది టెండర్లు దాఖలు చేశారు. పాలకుర్తి–5, జనగామ–10, స్టేషన్ ఘన్‌పూర్‌లో ని–8 దుకాణాలకు ఇంకా బోనీ కాలేదు. టెండరుదారులు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
మద్యం దుకాణాలకు మూడు రోజులు సమయమే ఉండడంతో చివరి నిమిషాల్లో భారీగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. చాలామంది వ్యాపారులకు చివరి రోజుల్లోనే టెండర్లు వేయడం ఆనవాయితీ. గతంలోనూ అలానే జరిగిందని జిల్లా ఎకై ్సజ్ అధికారులు అంటున్నారు. ప్రస్తుత టెండర్ల మందగమనం ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద సవాలుగా మారింది. మద్యం టెండర్లు ప్రభుత్వం ఆదాయానికి ముఖ్యమైన వనరు కావడంతో, చివరి మూడురోజుల్లో వ్యాపారులు ముందుకు రావాలని అధికారులు ఎదురుచూస్తున్నారు.
సర్కిల్ దుకాణాలు టెండర్లు
జనగామ 20 38
స్టే.ఘన్‌పూర్ 16 27
పాలకుర్తి 14 18
మొత్తం 50 83
ఇప్పటివరకూ నామమాత్రంగానే
మద్యం టెండర్లు
ఎకై ్సజ్ శాఖ అధికారుల్లో టెన్షన్
పాత వ్యాపారులు,
ఉత్సాహవంతులకు ఫోన్లు