
ఆలయాల భూములను కాపాడాలి
–10లోu
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్‌లో మాత యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు, ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు చల్లి మాధవరెడ్డిని పరామర్శించారు. అంతకుముందు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
– సాక్షిప్రతినిధి, వరంగల్
జనగామ రూరల్: ఆలయాల భూములను కాపాడాలని భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. బుధవారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన ఆలయాలపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎండోమెంట్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావుతో కలిసి దేవస్థానాల చైర్మన్లు, ఈఓ, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో గల ఆరు దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. జీడికల్ రామచంద్రస్వామి, చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి, స్టేషన్ ఘన్‌పూర్ తిరుమలనాథస్వామి, నవాబ్‌పేట కోదండరామస్వామి, చిన్నపెండ్యాల లక్ష్మీనరసింహస్వామి, జఫర్‌గడ్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పర్యవేక్షించాలన్నారు. నవంబర్ 10వ తేదీన జరిగే జీడికల్ లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణాన్ని పురస్కరించుకొని తగు ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులు ఉండేందుకు మౌలిక సదుపాయాలు రూమ్ లను నిర్మించాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. దేవాలయాల భూములను త్వరగా సర్వే చేిసి ఎండోమెంట్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని హద్దులను ఏర్పాటు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కొనసాగించాలి..
జిల్లా కేంద్రంలోని గ్రీన్ మార్కెట్ లోపల పత్తి యార్డు కోసం నిర్మించిన స్థలంలో రెండు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందూనాయక్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గతంలో మార్కెట్ యార్డు బయట ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వల్ల రైతుల ధాన్యాన్ని పెద్దఎత్తున దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి