
మున్సిపల్ డ్రైవర్ల ఆందోళన
జనగామ: పురపాలిక శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ అసిస్టెంట్ (జూనియర్ అసిస్టెంట్) డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఆటో, ట్రాక్టర్, వా టర్ ట్యాంకర్లు నడిపించే 22 మంది డ్రైవర్లు శని వారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగా రు. సీఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పెద్దగళ్ల సుధాకర్, బొట్ల నాగరాజు, మసిరాజు, మునిగె రవి తదితరుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ భూపాలపల్లి నుంచి డిప్యుటేషన్‌పై ఇక్కడకు వచ్చి పని చేస్తున్న శేఖర్ శానిటేషన్, వాటర్, ఆటో డ్రైవర్లను నెలానెల రూ.వెయ్యి చొప్పున రూ.22 వేలు ఇవ్వాలని వేధిస్తున్నాడన్నారు. అధికారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లిగారి రాజు, తదితరులు ఉన్నారు. ఈ విషయమై పులి శేఖర్ మాట్లాడుతూ శానిటేషన్ విభాగంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని విధులను సక్రమంగా చేయాలని చెప్పడంతోనే తాను డబ్బులు అడిగినట్లు నిందలు వేస్తున్నారన్నారు. డ్రైవర్లను సమయ పాలన పాటించడంతో పాటు విధులను సక్రమంగా నిర్వహించాలని తరచూ చెప్పడంతో కోపం పెంచుకుని, దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు.