
కార్యకర్తల అభిప్రాయంతోనే డీసీసీ ఎన్నిక
పాలకుర్తి టౌన్: కార్యకర్తల అభిప్రాయ సేకరణతోనే డీసీసీ ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ అన్నారు. డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమం పేరిట ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఎండీ అఫిజ్, శ్రీకాంత్‌యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతోనే నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు లకావత్ లక్ష్మీనారాయణనాయక్, కొమ్మురి ప్రశాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ఎర్రబెల్లి రాఘవరావు, గంగు కృష్ణమూర్తి, కుమారస్వామి, శ్రీరాములు నాయకుల పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్ష పదవికి ఝాన్సీరెడ్డి దరఖాస్తు
జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి దరఖాస్తును నియోజకవర్గ నాయకులు ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులకు అందజేశారు.
ఏఐసీసీ పరిశీలకుడు
దేబాసిస్ పట్నాయక్