ఉద్యమకారుల డిమాండ్లు: | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల డిమాండ్లు:

Oct 11 2025 6:16 AM | Updated on Oct 11 2025 6:16 AM

ఉద్యమకారుల డిమాండ్లు:

ఉద్యమకారుల డిమాండ్లు:

● స్థానిక యువతకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి.

● జిల్లా ఉద్యమచరిత్రకు గుర్తుగా ఉద్యమ స్థూపం నిర్మించాలి.

● జనగామ రూరల్‌, అర్బన్‌ మండలాలతో కలిపి జిల్లా పరిధిని 16 మండలాలుగా విస్తరించాలి.

● జిల్లాకు ఎస్‌పీ కార్యాలయం హోదా కల్పించాలి.

● జిల్లా కేంద్ర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలి.

● మ్యూజియం, అంబేడ్కర్‌ ఆడిటోరియం, ఆధునిక స్టేడియం నిర్మించాలి.

● నిలిచిపోయిన ప్రభుత్వ ఐటీఐ, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నిర్మాణాలు పూర్తి చేయాలి.

● కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలి.

● పాలకుర్తిని మున్సిపాలిటీగా ప్రకటించాలి.

● మహిళల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించాలి.

● రంగప్ప చెరువు సుందరీకరణతో పాటు మినీ పార్కులు ఏర్పాటు చేయాలి.

● సర్వాయి పాపన్న గౌడ్‌ వీరత్వానికి చిహ్నంగా ఖిలాషాపురం కోట పునరుద్ధరించాలి.

● మాణిక్యపురంలో చుక్క సత్తయ్య కళాక్షేత్రం ఏర్పాటు చేయాలి.

● సిద్ధులగుట్ట, జీడికల్‌, పాలకుర్తి, చీటకోడూర్‌, బాణాపురం దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి.

● మోడల్‌ మార్కెట్‌ను పూర్తి చేయాలి.

● జిల్లా ఆసుపత్రిలో ఎమ్మారై, ఆంజియోగ్రామ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి.

● చంపక్‌హిల్స్‌, చీటకోడూర్‌ డ్యాంలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి.

● జనగామ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలి.

● 50 ఏళ్ల చరిత్ర కలిగిన జనగామ ఆర్టీసీ బస్టాండును ఆధునీకరించి జిల్లా స్థాయి బస్టాండ్‌గా అభివృద్ధి చేయాలి.

ప్రభుత్వ హామీలపై ఉద్యమకారుల ప్రశ్నలివి:

● ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఇంకా ప్రారంభం కాలేదు.

● 2014లో ప్రకటించిన పెంబర్తి–వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కలగానే మిగిలిపోయింది.

● బీసీస్టడీ సర్కిల్‌, జిల్లా గ్రంథాలయం, జిల్లా పరిషత్‌ భవనం నిర్మాణం ఇంకా మొదలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement