
సీఎంఆర్ సేకరణలో వేగం పెంచండి
జనగామ: జిల్లాలో రా రైస్(ముడి ధాన్యం) మిల్లర్లు 2024–25(రబీ)కి సంబంధించిన సీఎంఆర్ బియ్యం వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్‌లో పౌర సరఫరాల శాఖతో కలిసి గత సీఎంఆర్, ప్రస్తుత 2025–26 ఖరీఫ్ సీజన్‌లో వచ్చే ధాన్యం దిగుమతిపై నిర్వహించిన సమీక్షలో బెన్ షాలోమ్ పాల్గొని మాట్లాడారు.. వానాకాలం సీజన్‌లో మిల్లర్ల అధ్యక్షులు కోరిక మేరకు ధాన్యం కేటాయింపులు ఉంటాయన్నారు. రా రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ, బ్యాంకు గ్యారంటీలను పౌరసరఫరాల డీఎంకు సమర్పించాలన్నారు. అలాగే మిల్లర్ల అగ్రిమెంట్ సైతం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమీక్షలో డీసీఎస్‌ఓ సరస్వతి, ఏసీఎస్‌ఓ డీఎం హథీరామ్, మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్, బెల్దే వెంకన్న, మిల్లర్లు ఉన్నారు.
మిల్లర్లకు అదనపు కలెక్టర్
బెన్ షాలోమ్ ఆదేశం