
ఆర్టీఏ కేసుల పరిష్కారంపై కలెక్టర్‌కు అవార్డు
జనగామ రూరల్: ఆర్టీఏ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించినందుకుగానూ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమాచార హక్కు చట్ట వారోత్సవాలు సందర్భంగా గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్, బెస్ట్ పీఐవో బెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇన్‌డిస్పోజల్ ఆఫ్ ఆర్టీఐ కేసెస్ మొదలగు ఏడు విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలో అధికారుల సమన్వయంతో ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పెండింగ్ లేకుండా వ్యవహరించినందుకు కలెక్టర్ ఈ అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌కు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు వివిధ అంశాల్లో వరుసగా అవార్డులు వస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు.
సీఎం గారూ.. జిల్లా విద్యాశాఖను చక్కబెట్టండి
● ‘సాక్షి’ కథనాలతో ఎక్స్‌లో సీఎంకు ట్యాగ్
జనగామ: జిల్లాలో టీచర్ల సర్దుబాటు జాప్యంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిపోతోందని, చదువు విషయంలో ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలతో ‘ఎక్స్’ వేదికగా ట్యాగ్ చేస్తూ సోషల్ వాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి మంగళ్లపల్లి రాజు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ శాఖకు పోస్టు చేశారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు విషయమై నాన్చుడు ధోరణిపై ప్రజాసంఘాలు, విద్యావేత్తలు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా వ్యాప్త ఆందోళనకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి గాడితప్పిన జిల్లా విద్యాశాఖను చక్కబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆర్టీఏ కేసుల పరిష్కారంపై కలెక్టర్‌కు అవార్డు