
నామినేషన్ కేంద్రం పరిశీలన
లింగాలఘణపురం: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని గురువారం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆర్వో హతీరామ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, ఎస్సై శ్రావణ్‌కుమార్, ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు సీహెచ్ ఉపేందర్, జి.నాగరాణి, ఎం.జయప్రకాశ్, ఎండీ ఇబ్రహీం, ఏఆర్‌ఓలు తదితరులు ఉన్నారు.
చిల్పూర్‌లో..
చిల్పూరు: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మాధవీలతతో కలిసి గురువారం డీసీపీ రాజమహేందర్‌నాయక్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఎంపీఓ మధుసూదన్ పాల్గొన్నారు.

నామినేషన్ కేంద్రం పరిశీలన