
జీపీఓల సేవలు షురూ..
● బాధ్యతల స్వీకరణ
● పాలనతో కీలకం కానున్న జీపీఓలు..
జనగామ: జిల్లాలో గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓ) పాలన మంగళవారం నుంచి షురూ అయింది. వీఆర్‌ఏ, వీఆర్‌ఓలుగా పని చేసి అనుభవం కలిగి, ప్రస్తుతం వివిధ శాఖల్లో పని చేస్తున్న వారిలో 129 మంది జీపీఓలుగా అర్హత సాధించారు. జిల్లాలో 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో 129 రెవెన్యూ క్లస్టర్లు ఉన్నాయి. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జీపీఓలు వారికి కేటాయించిన మండలాలు, గ్రామాల పరిధిలో బాధ్యతలను స్వీకరించి ఎంపీడీఓలకు రిపోర్టు చేశారు.