
నేడు చంద్రగహణం
● ఆలయాల మూసివేత
జనగామ/బచ్చన్నపేట: దేశంలో నేడు (ఆది వారం) రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసి వేయనున్నారు. ఈ మేరకు బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గా మాత ఆలయ ప్రధాన పూజారి ఆరాధ్య శర్మ శనివారం తెలిపారు. రాత్రి 9.56 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందన్నారు. ఆలయాలను మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసి వేసి, ఈ నెల 8వ తేదీ తెల్లవారు జాము ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శ నం చేసుకునే వీలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రజలు సాయంత్రం 5 గంటల వరకే ఆహారం తీసుకుని, తిరిగి మరుసటి రోజు స్నానమాచరించి, ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాతనే ని త్యందన జీవితాన్ని ప్రారంభించాలన్నారు. చంద్రగ్రహణం నేపధ్యంలో 8వ తేదీన శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయన్నారు. బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని నేడు మూసివేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమశివాయలు తెలిపారు.
● డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ రూరల్: యువత సన్మార్గంలో సమాజ హితం కోసం పనిచేయాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏసీరెడ్డినగర్ కాలనీలో గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిమజ్జన ఊరేగింపులో మద్యం సేవించడం, ఘర్షణలు పెట్టుకోవడం చేయొద్దని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసుకోవాలన్నారు. యువత చదువు, క్రీడలు వ్యాయామంపై దృష్టి సారించి సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దామోదర్ రెడ్డి, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, బూడిది ప్రశాంత్, పాము భిక్షపతి, ధరావత్ మహేందర్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
జనగామ రూరల్: పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో శనివారం నిర్వహించిన క్రీడాపోటీల్లో పలువురు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు డీవైఎస్‌ఓ బి. వెంకటరెడ్డి తెలిపారు. బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా నుంచి సుమారు 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 9,10 తేదీల్లో ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారన్నారు. అనంతరం సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో రాకేశ్, ప్రసాద్, కిష్టయ్య, మనోజ్ కుమార్, హనుమంతరావు, అశోక్ యాదగిరి, సంగీత మాధురి, మాధవి, దిలీప్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ టీచర్ల ఎంపికలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. వినూత్న పద్ధతిలో బోధన, సీనియార్టీ, అడ్మిషన్లు పెంపు, వంద శాతం డ్రాప్ అవుట్ లేని బడులతో పాటు ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్తమంగా నిలుస్తున్న వారిని మండల, జిల్లా స్థాయికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో పైరవీ లకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు బాహా టంగానే వినిపిస్తున్నాయి. ఇ ఉత్తమ టీచర్ కోసం దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్నప్పటికీ వారి పేర్లను తొలగించి, పైరవీ చేసుకున్న వారికి చోటు కల్పిస్తున్నారనే ప్రచారం ఎంత వరకు నిజమనే విషయాన్ని ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది.
డాక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: ఈనెల 17న నిర్వహించే డాక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ డివిజన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సహాయ సంచాలకులు కె.శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను ఈ నెల 8వ తేదీలోగా అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టుమాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్–500001 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలన్నారు. కవర్‌పై 51 డాక్ అదాలత్ అని తప్పనిసరిగా రాయాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 17వ తేదీ 11 గంటలకు గూగుల్ మీట్ ద్వారా పరిష్కరిస్తామన్నారు.

నేడు చంద్రగహణం