
ప్రతీ గ్రామానికి సాగునీరు అందించాలి
చిల్పూరు: సాగునీటి వసతులు లేని ప్రతీ గ్రామానికి మల్లన్నగండి దేవాదుల రిజర్వాయర్ ద్వారా అందించాలనే డిమాండ్‌తో తాను ఒక రోజు పాదయాత్ర చేపట్టినట్టు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. ఆదివారం ఉదయం వేలేరులో చేపట్టిన పాదయాత్ర మధ్యాహ్నం చిల్పూరు మండలం కొమ్ముగుట్టకు చేరుకోగానే సాగునీటి వసతులు లేని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాల కు చెందిన రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు రాజయ్యకు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ద్వారా లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతర జరిగే గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జనగామ యాదగిరి, మాలోతు రమేశ్‌నాయక్, కంకటి రవి, వెన్నం మాధవరెడ్డి, రంగు హరీశ్, బత్తుల రాజన్‌బాబు, లొడెం రవీందర్, గాలి ప్రవీణ, డాక్టర్ గూళ్ల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య