
ఓపీఎస్ సమరయాత్ర!
● పెన్షన్ స్కీం కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, పెన్షన్ కమ్యూనికేషన్, హెల్త్‌కార్డులు ఉండవు.
● సీపీఎస్ షేర్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో ఎంత పెన్షన్ వస్తుందో తెలియదు. అందుకే దీనిని అన్ డిపెండెడ్ పెన్షన్ స్కీం అంటారు. షేర్ మార్కెట్‌లో నష్టాలు వస్తే ఇబ్బందులు తప్పవు.
● కొత్త పెన్షన్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్, ఆర్‌డీఏ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే అస్కారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
జనగామ: ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆర్థిక విధానాలకు అనుగుణంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం (ఎన్‌డీఏ) కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయ, ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ విధానాన్ని అమలుచేస్తూ కొత్త జీవోలను తీసుకొచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ని సమర్థిస్తూ అమల్లోకి తెచ్చింది. సదరు సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలుచేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం(నేడు) కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే మహాసభకు బయలుదేరుతారు.
2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ సీపీఎస్ పరిధిలోకి తీసుకొస్తూ 653, 654, 655 జీవోలను విడుదల చేసింది. సీపీఎస్ నూతన పెన్షన్ విధానం అమలులోకి రావడంతో ఉద్యోగి వేతనం బేసీక్ పే నుంచి 10శాతం తీసుకుని మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభుత్వం మరో 10శాతం కలిపి మొత్తాన్ని షేర్ మార్కెట్‌లో పెడుతుంది. సీపీఎస్ ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత 60శాతం నగదు చేతికి అందించి, రూ.పది లక్షలు దాటితే దానిపై 30శాతం పన్ను విధించేలా జీవోలను సవరించింది. మిగిలిన 40శాతం నగదును షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి దానిపై వచ్చే వడ్డీని ప్రతీ నెల పెన్షన్‌గా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా వచ్చే పెన్షన్ చాలా తక్కువగా ఉండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాత పెన్షన్ విధానంలో ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, పెన్షన్ కమ్యూనికేషన్, హెల్త్ స్కీంలు కూడా అమలులో ఉండడంతో రిటైర్ అయిన ఉద్యోగికి కచ్చితంగా భరోసా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు ఏటా సెప్టెంబర్ 1వ తేదీని నిరసన దినోత్సవంగా పాటిస్తూ, తమ హక్కుల సాధన కోసం గళమెత్తనున్నారు.
సీపీఎస్ అమలైన తర్వాత..
సీపీఎస్ విధానం అమలైన తర్వాత జిల్లాలో సుమారుగా 3వేల మంది నియమితులయ్యారు. ఉపాధ్యా య, ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత సామాజిక భద్రతకు పెన్షన్‌ను ఒక్క హక్కుగా 1982లో కల్పించారు. అయితే పెన్షన్‌తో పాటు గ్రాట్యుటీని కూడా రద్దుచేయడంతో ఉద్యోగ విరమణ అనంతరం భద్రత లేకుండా పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ఉపాధ్యాయ, ఉద్యోగులకు శాపంగా మారింది.
పాత పింఛన్ విధానం కోసం టీచర్లు, ఉద్యోగుల పోరుబాట
కలెక్టరేట్ వద్ద ధర్నాలు..హైదరాబాద్‌లో మహాసభ
నేడు సీపీఎస్ ఉద్యోగుల
నిరసన దినోత్సవం