
పొద్దంతా క్యూలోనే..
పాలకుర్తి టౌన్: యూరియా కోసం మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం గోదాం వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రైతులు క్యూలో బారులు తీరారు. 444 బస్తాలు యూరియా రాగా వ్యవసాయ అధికారులు సమక్షంలో సొసైటీ సిబ్బంది, పోలీస్ బందోబస్తు మధ్య ఒక్క రైతుకు ఒకే బస్తా చొప్పున అందజేశారు. గంటల తరబడి క్యూలో నిలబడిన రైతులు కొందరికీ దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
నర్మెటలో..
నర్మెట: సాగుచేసిన పంటలకు సమయానికి యూ రియా వేద్దామంటే చాలినంత దొరకకపోవడంతో సొసైటీల షాపుల ముందు ఆడా, మగా తేడా లేకుండా బారులుతీరుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నిల్వ ఉందని తెలుసుకున్న రైతులు ఆదివారం ఉదయం నుంచే బారులు తీరారు. కొందరికీ దొరక్కపోవడంతో రెండు రోజులలో యూరియా అందుబాటులోకి వస్తుందని తెలుపడంతో నిరాశతో వెనుదిరిగారు.
యూరియా కోసం అవే తిప్పలు
ఒక్కరికీ ఒకే బస్తా..
వెనకుంటే దొరకనట్టే

పొద్దంతా క్యూలోనే..