
కేంద్ర ఆర్థిక పథకాలతో మహిళల స్వావలంబన
● ఆర్‌బీఐ జీఎం ఎంజీ సుప్రభాత్
పాలకుర్తి టౌన్: సామాజిక ఆర్థిక భద్రత పథకాలతో గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించేందుకు బ్యాంకులు పనిచేస్తున్నాయని ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ ఎంజీ సప్రభాత్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్ విలేజ్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, సంతృప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను ప్రజలకు చేరవేడయంతో పాటు కేవైసీ అప్‌డేట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేంద్రన్‌తో కలిసి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సురక్ష బీమా యోజన, జీవన్‌జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పరిధిలో గల 33 మహిళ సంఘాలకు రూ.4కోట్ల రుణాల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీఎన్‌బీ సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ సుజిత్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ వసంత, ఏపీడీ నూరోద్దిన్, పీఎన్‌బీ మేనేజర్ అడేపు రమేశ్, డీసీఎం శ్రీనివాస్, ఏపీఎం శ్రీరాములు, చంద్రశేఖర్ సీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.