
జైన రమేశ్‌కు డాక్టరేట్
జనగామ: జనగామ పట్టణానికి చెందిన జైన రమేశ్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ మేర కు శుక్రవారం గుడ్‌న్యూస్, డేస్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ న్యూయార్క్ టెక్సాస్ అనుబంధ సంస్థ గాడ్‌సన్ హోలీ యూనివర్సి టీ వారు హైదరాబాద్‌లో యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ డానియల్ కార్తికేయన్, అధ్యక్షుడు అ డ్రైన్ నజేరా చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. దీంతో రమేశ్‌ను ఆర్యవైశ్యులు, పలువురు అభినందించారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి
జనగామ రూరల్: అసంపూర్తిగా ఉన్న గానుగుపహడ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిని సందర్శించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని గానుగుపహడ్ వాగుపై నిర్మించిన బ్రిడ్జి అసంపూర్తిగా ఉండడంతో రెండేళ్ల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొట్ల శేఖర్, కార్యదర్శి బోడ నరేందర్, బూడిద గోపి, జోగు ప్రకాశ్, సుంచు విజేందర్, బండిరాజుల శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
హామీలు నెరవేర్చాలి
దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మేరకు కల్లు గీత కార్మికుల హామీలు నెరవేర్చాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాల్నె వెంకటమల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ నెల 2వ తేదీన జిల్లాలోని వడ్లకొండలో బయలు దేరిన ‘అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్ర’ మండలానికి చేరింది. ఈ సందర్భంగా అక్షర గార్డెన్‌లో సంఘం మండల మహాసభ మండల అధ్యక్షుడు ఉప్పునూతల అయోధ్య అధ్యక్షతన అమరులకు ఘననివాళులర్పించారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కారు పోతుల యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి పరీదుల భాస్కర్, తుకారాం సోషల్ మీడియా కన్వీనర్ మిట్ట భిక్షపతి, మొలుగురి సంతోష్ కుమార్, టీసీఎస్ అధ్యక్షుడు కన్నా రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

జైన రమేశ్‌కు డాక్టరేట్

జైన రమేశ్‌కు డాక్టరేట్