
జీపీ కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు
దేవరుప్పుల: జీపీ కార్మికుల సమస్యల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని గ్రామ పంచాయ తీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఓ గార్డెన్‌లో బస్వ రామచందర్ అధ్యక్షతన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జీపీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింగారపు రమేశ్, ప్రజా నాట్యమండలి జిల్లా నాయకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా సంగీ కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటరెడ్డితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.