
కార్పొరేట్ దోపిడీని వ్యతిరేకించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: దేశంలో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్య పోరాటాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షు డు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13న బహుళ జాతి కంపెనీలు భారతదేశాన్ని, భారత వ్యవసాయాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని ఇప్పగూడెంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హా జరైన సోమయ్య మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాదానికి మోదీ ప్రభుత్వం లొంగొద్దన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుమారస్వామి, శ్రీను, మొగిలి, రమేశ్, వెంకటయ్య, సోమ య్య, గోపయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య