
పింఛన్లు పెంచాలి
● 12న పాలకుర్తికి మంద కృష్ణమాదిగ..
● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ మాదిగ
పాలకుర్తి టౌన్/పాలకుర్తి: సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు పింఛన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4 వేలు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ జిల్లా ఇన్‌చార్జ్ బోడ సునీల్‌మాదిగ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని బాషారత్ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్, ఎంపీఎస్, వీహెచ్‌పీఎస్ జిల్లా స్థాయి సమావేశం ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బోడ సునిల్ మాదిగ మాట్లాడుతూ.. పెన్షన్లు పెంచాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 12న పాలకుర్తిలో చేయూత పింఛన్‌దారుల మహాసభకు ముఖ్యఅతిఽథిగా మంద కృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, బిర్రు నాగేశ్, గడ్డం సోమరాజు, సందెన రవిందర్, చెరుపెల్లి యాదగిరిస్వామి, జెరిపోతుల సుధాకర్ పాల్గొన్నారు.