ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్‌

Jul 27 2025 6:58 AM | Updated on Jul 27 2025 6:58 AM

ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్‌

ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. రెండో రాజధానిగా వరంగల్‌ అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రకటించారు. ఈమేరకు సీఎం, మంత్రులు ఓరుగల్లు అభివృద్ధిపై తరచూ సమీక్షలు చేస్తున్నారు. తాజాగా.. శనివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ సచివాలయంలో వరంగల్‌ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరా జ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి వరంగల్‌ విమానాశ్రయం, మెగా టెక్స్‌టైల్‌ పార్కు, భద్రకాళి దేవస్థానం, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఔటర్‌రింగ్‌ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.

ఓరుగల్లు అభివృద్ధిపై ఆశలు..

మామునూరు ఎయిర్‌పోర్ట్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు తదితర అంశాలపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీని వా స్‌రెడ్డి.. కలెక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ కల త్వరలో సాకారం కానుందని, ఇందుకు అవసరమైన భూసే కరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, రూ.205 కోట్లు విడుదల చేశామని, భూ సేకరణకు గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులు వి డుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సంబంధించి అక్కడ రాజీవ్‌గాంధీ టౌన్‌షిప్‌లో ఆర్‌–ఆర్‌ ప్యాకేజీ కింద 1,398 మంది లబ్ధిదారులను గుర్తించి 863 ప్లాట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ కాలనీలో సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే, వెటర్నరీ హాస్పిటల్‌, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ కా ర్యాలయ భవనం నిర్మించాలని, మెగా టెక్స్‌టైల్‌ పార్కులో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. 2057జనాభాను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌లో రూ.4,170కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను త్వరగా ప్రారంభించాలని, పనులను విభజించుకుని దశల వారీగా చేపట్టాలని మార్గదర్శనం చేశారు. సమావేశంలో ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు ప్రకాశ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సారయ్య, అంజిరెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా కలెక్టర్లు స్నేహశబరీష్‌, సత్యశారద, రిజ్వాన్‌బాషా, సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఎస్పీలు శబరీష్‌, కిరణ్‌ఖరే పాల్గొన్నారు.

ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం.. సీఎం, మంత్రుల వరుస సమీక్షలు

త్వరలో ఎయిర్‌పోర్టు,

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం

మెగా టెక్స్‌టైల్‌ పార్కు, ‘భద్రకాళి’,

‘స్మార్ట్‌’ పనుల పరుగులు

హైదరాబాద్‌లో సమీక్షించిన ఇన్‌చార్జ్‌

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు,

ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భద్రకాళి..

భద్రకాళి ఆలయ మాడవీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్‌ అలంకరణను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తానే స్వయంగా వస్తానని, రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జితో సహా అన్ని పనులు వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తిచేయాలన్నారు. భద్రకాళి చెరువు ప్రాంతంలో ఇంతవరకు 3.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించామని, రూ.2.06 కోట్ల విలువైన మట్టిని విక్రయించామని అధికారులు వివరించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా వరంగల్‌ జిల్లాలో క్రికెట్‌ స్టేడియానికి అవసరమైన భూమి గుర్తించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా వరంగల్‌ నగరాన్ని రెండో రాజధానిగా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. వరంగల్‌ అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్‌, టెండర్‌, పనులు ప్రారంభించడానికి, పూర్తిచేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement