
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వ స్తున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం అ దనపు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గూగు ల్ మీట్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని, సంబంధిత గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనా యక్, గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, పంచాయతీ అధికారిని స్వరూపలతో కలిసి ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వస్తున్న సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలు ఉన్న మండలాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ఈడీఎం వెళ్లాలని ఆదేశించారు. ఈ–కేవైసీ, బ్యాంక్ అకౌంట్స్, ఉపాధి హామీ జాబ్ కార్డ్స్ వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయంలో అధికారులు బాధ్యతగా పనిచేయాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన గృహ నిర్మాణాల్లో వస్తున్న సాంకేతిక సమస్యలపై ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ పీడీ మాతృనాయక్, ఈడీఎం గౌతమ్‌రెడ్డి, ఎంపీడీఓ విజయశ్రీ పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
లింగాలఘణపురం: ప్రతిఒక్కరూ ఇంటింటికి మొక్కలు నాటాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని బండ్లగూడెం గ్రామాన్ని సందర్శించి మొక్కలను పంపిణీ చేశారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్