
జీపీఓ పరీక్ష సజావుగా నిర్వహించాలి
జనగామ రూరల్: నేడు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో జరగనున్న జీపీఓ, లైసెన్స్‌డ్ సర్వేయర్ల అర్హత పరీక్ష సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ ఆదేశించారు. శనివారం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తుల తనిఖీ ప్రక్రియ పరిశీలించారు. దరఖాస్తుల విచారణ ప్రక్రియను ఆలస్యంగా చేస్తున్న దేవరుప్పుల, స్టేషన్‌ఘనపూర్, కొడకండ్ల మండలాలకు సంబంధించిన దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
అంకితభావంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు
జనగామ రూరల్: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యం అవుతాయని డీఈఓ భోజన్న అన్నారు. శనివారం మండల విద్యాశాఖ అధికారి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకంచ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. న్యాస్ పరీక్షలో జనగామ జిల్లా మొదటి 50 స్థానంలో ఉండటం ఆనందదాయకమన్నారు. ఉపాధ్యాయులు మరింత ఉత్సాహం, అంకితభావంతో పనిచేసి మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తాటోజు శ్రీనివాసులు, పెంబర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ నాగరాణి పాల్గొన్నారు.
దరఖాస్తులు త్వరగా
పరిష్కరించాలి
నర్మెట: భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్–2 కె.కొంరయ్య అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, దరఖాస్తులను పరిశీలించారు. వారసత్వపు దరఖాస్తులలో పట్టాదారులుగా తల్లిదండ్రుల పేర్లు ఉండి పట్టాదారు పాసుపుస్తకం, మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల (వారసుల) వివరాలు క్లుప్తంగా ఉంటేనే పరిశీలించాలని తహసీల్దార్ ఎండీ.మొహసీన్ ముజ్‌తాబకు సూచించారు. మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం సవరణ, పట్టాదారు పాసు పుస్తకంలో పేర్లు తప్పుగా ఉంటే సవరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ కురికాల వేణు, ఆర్‌ఐ సింగారం సాయిబాబ, సిబ్బంది పాల్గొన్నారు.

జీపీఓ పరీక్ష సజావుగా నిర్వహించాలి

జీపీఓ పరీక్ష సజావుగా నిర్వహించాలి