
సర్వం సిద్ధం!
లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష వివరాలు
పరీక్ష రాసే అభ్యర్థులు: 173
సెంటర్:
ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల
పరీక్ష సమయం:
మొదటి పరీక్ష:
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట
వరకు
రెండవ పరీక్ష:
మధ్యాహ్నం 2
నుంచి 5 గంటల
వరకు
రేపు లైసెన్స్‌డ్
సర్వేయర్ల పరీక్ష
● 28, 29న ప్రాక్టికల్స్
● మొబైల్స్‌కు అనుమతి లేదు
● సెంటర్ వద్ద 144 సెక్షన్
● కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంకు ప్రశ్నపత్రాలు
జనగామ: లైసెన్స్‌డ్ సర్వేయర్ల తుది పరీక్షకు జిల్లాలో సర్వంసిద్ధం చేశారు. కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆధ్వర్యంలో పరీక్షల కో–ఆర్డినేటర్, సర్వే డిపార్ట్‌మెంట్ ఏడీ మన్యంకొండ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నా రు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం– 2025 భూమి కొలతలు, సర్వే చేసేందుకు లైసెన్స్‌డ్ పొందిన సర్వేయర్ల కోసం పరీక్ష నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాలో 225 మంది సర్వేయర్లు లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇద్దరు గైర్హాజరు కాగా, 223 మంది ఈ ఏడాది మే 26 నుంచి జూలై 26 (నేటి వరకు) వరకు 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో 173 మంది పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు.
రెండు రోజులపాటు ప్రాక్టికల్స్
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఈ నెల 27న (ఆదివారం) తుది పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్లాటింగ్ పరీక్ష జరగనుంది. 28, 29వ తేదీల్లో యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షతో శిక్షణ సంపూర్ణంగా ముగియనుంది. 27వ తేదీన జరిగే పరీక్ష కోసం పట్టణంలోని సిద్దిపేటరోడ్డు ఏబీవీ ప్రభుత్వ (అటానమస్) డిగ్రీ కళాశాలలో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 173 మంది అభ్యర్థుల కోసం ఏడు గదులను ఏర్పాటు చేయగా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించనున్నారు. థియరీ, ప్లాటింగ్, ప్రాక్టికల్స్‌కు 100 మార్కుల చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఇందులో ప్రతి పరీక్షలో 60 మార్కులు సాధించిన అభ్యర్థులు లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు అర్హత సాధిస్తారు.
ఉదయం 9.45 నిమిషాలకే సెంటర్‌లోనికి..
పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు 9.45 గంటల వరకు సెంటర్ లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి లోనికి అనుమతించరు. అభ్యర్థి వెంట సెల్‌ఫోన్ అనుమతి లేదు. చీఫ్ సూపరింటెండెంట్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి విక్రమ్, చీఫ్ అబ్జర్వర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్, 8 మంది ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య, లోటు పాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ నుంచి 5 వరకు జేఎన్‌టీయూహెచ్‌లో పేపర్ కరెక్ష న్, 10వ తేదీన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇ దిలా ఉండగా ప్రశ్న పత్రాలు శుక్రవారం జిల్లాకు చే రుకోగా, కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.

సర్వం సిద్ధం!

సర్వం సిద్ధం!