
అభివృద్ధి పనుల పరిశీలన
జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటను పంచతంత్ర థీమ్‌లో అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్ధేశ్యంతో రూ.1.50కోట్లతో బతుకమ్మకుంట అభివృద్ధి పనులు చేయిస్తున్నామన్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. వారం రోజుల్లోపు సివిల్ పనులు పూర్తి చేసి రెండు వారాల్లో బతుకమ్మకుంట సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. చెరువు పూడికతీత, వాకింగ్ ట్రాక్ ఏరియా, లైటింగ్, రేలింగ్, ఫెన్సింగ్, వాటర్ ట్యాంక్ పనుల్లో వేగం పెంచాలన్నారు. అంతకు ముందు చిన్నపిల్లల ఆట వస్తువుల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.