
మొత్తం ఓటర్లు 7,67,426
జనగామ రూరల్: జిల్లాలో మొత్తం 7,67,426 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రాఫ్ట్ జాబితా ప్రకటన 2024 అక్టోబర్ 29 నాటికి జిల్లాలో 7,57,982 ఓటర్లు ఉండగా ఫైనల్ పబ్లికేషన్ (06.01.2025) నాటికి 7,61,642కు చేరిందన్నారు. తుది జాబితా 2025 జూలై 25 నాటికి 7,67,426 చేరిందన్నారు. ఇందులో పురుషులు 3,77,953 (49.25శాతం), మహిళలు 3,89,443 (50.75శాతం), ఇతరులు 30 మంది ఉన్నారన్నారు. నియోజకవర్గాల వారీగా జనగామ 2,48,245, స్టేషన్‌ఘన్‌పూర్ 2,59,095, పాలకుర్తి 2,60,086 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీకాంత్, ఎలెక్షన్ సూపరింటెండెంట్ స్వప్న, భాస్కర్, రవి, విజయభాస్కర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా శశాంక
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌కు 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి కమిషనర్‌గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఫీవర్ సర్వే చేపట్టాలి
జనగామ రూరల్: గ్రామాల్లో వైద్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో పర్యటించాలన్నారు. శానిటేషన్‌పై పర్యవేక్షించి పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. మురుగు కాల్వలో దోమలు పెరగకుండా స్ప్రే చేయించాలన్నారు. తాగునీటి సరఫరాలో పైపులైన్ల లీకేజీ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురిషా, జిల్లా పంచాయతీ శాఖ అధికారి స్వరూపారాణి, వైద్య శాఖ అధికారి మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.

మొత్తం ఓటర్లు 7,67,426

మొత్తం ఓటర్లు 7,67,426