
శ్రావణ పూజలు షురూ
ఆలయాలకు పోటెత్తిన భక్తులు నెలరోజుల పాటు వ్రతాలు, పూజలు
జనగామ: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసం పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తిభావం నెలకొంది. అమ్మవార్లకు ప్రీతికరమైన శుక్రవారం శ్రావణమాసం రావడంతో ఆలయాలకు మహిళా భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో తెల్లవారు జాము నుంచే వేద మంత్రోచ్ఛారణల నడుమ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వర, లింగాలఘణపురం మండలం జీడికల్ సీతారామచంద్రస్వామి, చిల్పూరు బుగులోని వేంకటేశ్వరస్వామి, జనగామ పట్టణంలో వేంకటేశ్వర, రామలింగేశ్వర, గుండ్లగడ్డ ఉమామహేశ్వరస్వామి, మహంకాళీ, అమ్మబావి ఉప్పలమ్మ సహిత ఆంజనేయ, చెన్నకేశ్వర, సాయిబాబా, గీతాశ్రమం, బతుకమ్మకుంట విజయదుర్గామాత, హనుమకొండ రోడ్డులోని రేణుక ఎల్లమ్మ, పంచకోసు రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో శ్రావణ మాసం ప్రారంభం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదుర్గ అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించి, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రావణ పూజలు షురూ

శ్రావణ పూజలు షురూ

శ్రావణ పూజలు షురూ

శ్రావణ పూజలు షురూ