శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు

Jul 22 2025 7:54 AM | Updated on Jul 22 2025 8:08 AM

శాకంబ

శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డకాలనీలోని ఉమామహేశ్వర దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరీదేవి అలంకారణలో సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఉమామహేశ్వర దేవస్థానం మహిళా భక్తులు, అర్చకులు గంగు సాంబమూర్తి, రామశాస్త్రి అమ్మవారిని వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సిద్ధేశ్వరాలయంలో

ధర్మశాల ప్రారంభం

బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్‌ గ్రామంలోని సిద్ధేశ్వరాలయ ప్రాంగణంలో సద్గురు సదానంద దత్తాత్రేయ ఆలయంలో అలేఖ్య దత్త ధర్మశాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం ప్రారంభించారు. ముందుగా సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రిని శాలువాలతో సన్మానించారు. అలాగే దత్తాత్రేయ ఆలయంలో పూజలను నిర్వహించారు. భక్తుల కొంగు బంగారంగా సిద్ధేశ్వరాలయం నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్‌ ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్‌రెడ్డి, మల్లం శ్రీనివాస్‌, ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భగవద్గీతపై విస్తృత ప్రచారం

దేవరుప్పుల: మండలంలోని సింగరాజుపల్లిలో తైత్ర సిద్ధాంత భగవద్గీత గ్రంథాలపై త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక భువనగిరి, చేర్యాల, జనగామ, తొర్రూరు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విస్తృత ప్రచారం చేపట్టారు. శ్రీ కృష్ణాష్టమి త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల దివ్య ఆశీస్సులతో ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు దేవేంద్ర, లింగస్వామి లక్ష్మీనారాయణ, రామకృష్ణ, భాస్కర్‌, అశోక్‌, సాయిరాజ్‌, లత, రాణి, కవిత, రాజేశ్వరి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

30న జిల్లా స్థాయి

జూడో పోటీలు

రామన్నపేట: నగరంలోని కెమిస్ట్‌ భవన్‌లో ఈ నెల 30న సబ్‌ జూనియర్స్‌, కేడెట్‌ విభాగాల్లో బాల బాలికలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు బైరబోయిన కై లాష్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్‌ జూనియర్‌ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2011 – 2013వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 30 – 66 కిలోలలోపు, బాలికలు 28 – 57 కిలోల బరువు ఉండాలని పేర్కొన్నారు. కేడెట్‌ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2008 – 2010వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 50 – 90 కిలోల లోపు, బాలికలు 40 – 90 కిలోలలోపు ఉండాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు ఒరిజినల్‌ వెంట తీసుకొని రావాలని కోరారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 5, 6వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 99899 53253 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు..

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు గద్వాలలో జరగనున్న 10వ జూనియర్‌ అంతర్‌ జిల్లాల బాస్కెట్‌బాల్‌ పోటీలకు వరంగ ల్‌ జిల్లా బాలుర జట్టు ఎంపిక పూర్తైనట్లు వరంగల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీశ్వర్‌ రెడ్డి, రమేష్‌ తెలిపారు. ఈ నెల 6న హనుమకొండ సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో జిల్లా స్థాయి ఎంపికను నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థా యికి ఎంపిక చేసినట్లు వివరించారు.

శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు
1
1/2

శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు

శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు
2
2/2

శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement