
నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తాం..
పాలకుర్తి టౌన్/దేవరుప్పుల/కొడకండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల కేంద్రాల్లో నూతన రేషన్ కార్డులను అందించారు. అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కడవెండి వానకొండయ్య గుట్టపై కల్యాణోత్సవం, భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో అభివృద్ధి పనులు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన్ మంజుల, నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కారుపోతుల శ్రీనివాస్, తహసీల్దార్లు ఆడెపు అండాలు, చంద్రమోహన్, కొడకండ్ల మార్కెట్ చైర్‌పర్సన్ నల్ల ఆండాలు, ఎంపీడీఓ తాటి సురేష్, జిల్లా డైరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, నల్ల శ్రీరామ్, వడ్లకొండ తార, వెంకటేశ్వర్‌రెడ్డి, సురేష్‌నాయక్, సాయికృష్ణ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
పాలకుర్తి టౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గూడూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవి ష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ సమాజానికి దారి చూపిన మహానాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కొస్న వెంకటసోమనర్సింహరెడ్డి, అంబేడ్కర్ సంఘం అఽ ద్యక్షుడు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
వానకొండయ్య గుట్ట అభివృద్ధికి నిధులు
ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి