మెనూ ప్రకారం వడ్డించాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం వడ్డించాలి

Jul 20 2025 2:05 PM | Updated on Jul 20 2025 2:35 PM

మెనూ

మెనూ ప్రకారం వడ్డించాలి

అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌

బచ్చన్నపేట: మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం వడ్డించాలని అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు, మధ్యాహ్న వంటను వంట సామగ్రిని, కూరగాయలను పరిశీలించారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, జిల్లా బాలికల పర్యవేక్షణాధికారి గౌసియాబేగం, తహసీల్దార్‌ రామానుజాచారి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్‌, ఎంఈఓ ఇర్రి వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ గీత, మండల వైద్యాధికారి సృజన, ఆర్‌ఐ వంశీకృష్ణ తదితరులున్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జనగామ రూరల్‌: వసతి గృహాల అధికారులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని, స్థానికంగా నివాసం ఉండాలని అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని యశ్వంతపూర్‌ జీపీలోని పోస్ట్‌మెట్రిక్‌ బీసీ హాస్టల్‌ను శనివారం బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి రవీందర్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు.

నాసిరకం విత్తనాలు

విక్రయిస్తే చర్యలు

బచ్చన్నపేట: ఫర్టిలైజర్‌ షాపుల్లో నాసిరకం విత్తనాలు, నాణ్యత లేని మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని డీఏఓ అంబికాసోనీ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్‌ షాపుల్లో తనిఖీలు చేశారు. మందుల నిల్వ, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విద్యాకర్‌రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాళ్లు గీతా, భారతిదేవి తదితరులు పాల్గొన్నారు.

పోగొట్ట్టుకున్న ఫోన్ల అందజేత

జనగామ: ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఆందోళనకు గురవకుండా కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ తెలిపారు. ఏఎస్పీ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌తో కలిసి ఫోన్లు పోగొట్టుకున్న వెస్ట్‌జోన్‌ పరిధి 57 మందికి రికవరీ చేసి డీసీపీ చేతుల మీదుగా అందించారు.

‘సదరం’ బుక్‌ చేసుకోవాలి

జనగామ రూరల్‌: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌కు మీసేవ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని డీఆర్డీఓ ఎన్‌.వసంత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న దృష్టిలోపం, కంటి చూపు, తలసేమియా దివ్యాంగులు, 23న లెప్రసీ, 25న వినికిడి, మూగ, 29న లెప్రసీ 31న మెంటల్‌ ఇల్‌నెస్‌, ఇంటెలెక్చువల్‌కుగాను కొత్తవి 140 స్లాట్లు ఉండగా.. రెన్యువల్‌ 90 స్లాట్‌ ఉన్నట్లు వినియోగించుకోవాలని కోరారు.

న్యాయవాదుల శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలి

జనగామ రూరల్‌: న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ గాజుల రవీందర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న న్యాయవాదుల బిల్డింగ్‌ కాంప్లెక్స్‌లో (ఐలు) కో–కన్వీనర్‌ మహేశ్వరం బద్రీనాథ్‌ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. గాజుల రవీందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో 56 వేల మంది న్యాయవాద వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరందరి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం హైదరాబాద్‌లో న్యాయవాదుల శిక్షణ అకాడమీని వెంటనే ఏర్పాటు చేసి న్యాయవాదుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కో–కన్వీనర్‌ గద్దల అమృతరావు, వట్టేపు వినయ్‌కుమార్‌, న్యావాదులు బిట్ల గణేశ్‌, గుగులోత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, బాలబోయిన సంపత్‌, బస్కుల ఠాగూర్‌, తదితరులు పాల్గొన్నారు.

మెనూ ప్రకారం వడ్డించాలి
1
1/1

మెనూ ప్రకారం వడ్డించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement