
సోమేశ్వరాలయంలో పూజలు
పాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్వామివారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, పెందోట చక్రపాణి, శ్రీపాద ఉప్పలాచారి, రాజేంద్రచారి, ముత్తొజు రాము, రాజు, తదితరులు పాల్గొన్నారు.