
ప్రొఫెసర్ శ్రీలతకు అవార్డు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ సీజే శ్రీలతకు ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అవార్డు లభించింది. శ్రీలతకు బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రముఖ సంస్థ ది అకడమిక్ ఇన్‌సైట్స్ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు. ఈపురస్కారం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నత విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు అందజేస్తారు. ఈఅవార్డుల వివరాల్ని వారి అధికార జర్నల్ ది అకడమిక్ ఇన్‌సైట్స్ ఇన్‌స్పైరింగ్ మైండ్స్‌లో ఇటీవల ప్రచురించారు. ఈఅవార్డుపై సోమవారం యూనివర్సిటీలో శ్రీలత మాట్లాడారు.