
నడవలేరు.. కూర్చోలేరు..
జనగామ/జనగామ రూరల్: నడవలేరు, కూర్చోలేరు, కాళ్లు చేతులు ముడుచుకోలేరు, కంటిచూపు లేకున్నా.. తమ కంటి పాపలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులు దివ్యాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సదరం సర్టిఫి కెట్ ఉన్నా.. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పెంచేస్తున్నారు. బిడ్డలకు మెరుగైన వైద్యం కోసం కడుపు మాడ్చుకుంటున్న తల్లిదండ్రులు కలెక్టర్ కరుణిస్తాడని గ్రీవెన్స్‌కు వచ్చి అర్జీ అందజేసి న్యాయం జరుగుతుందని పూర్తి భరోసాతో ఇంటికి తిరిగి వెళ్లారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాల్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారానికి 75 మంది వినతులు సమర్పించారు. ఇందులో రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు నడవలేని దివ్యాంగపిల్లలను తీసుకుని కలెక్టరేట్‌కు రాగా.. వారిని చూసిన ప్రతి ఒక్కరూ మనోవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా పలు సమస్యలకు సంబంధించి కలెక్టర్‌కు విన్నవించుకోగా.. త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మరికొన్ని వినతులు ఇలా..
● 2007లో ఇందిరమ్మ మూడో విడతలో ఇంటి ని ర్మాణం కోసం ప్రభుత్వం ప్లాటు ఇచ్చిందని, ప్ర స్తుతం ప్లాటు కోసం వెళ్తే ప్రభుత్వం తిరిగి తీసుకుందని, ఇక్కడకు రావొద్దని అధికారులు చెబు తున్నారని కలెక్టర్‌కు విన్నవిస్తూ బచ్చన్నపేటకు చెందిన జాఫర్ కన్నీటి పర్యంతమయ్యారు.
● తమ కూతురు సమిహా ఫాతిమా పుట్టుకతోనే చెవిటి, మూగ. మాటలు రావడం లేదు. ప్రతీ నెల గొంతు ఫిజియోథెరఫీ కోసం రూ.9 వేలు ఖర్చు చేస్తున్నాం. పింఛన్ మంజూరు చేయాలని రఘునాథపల్లికి చెందిన నజీర్ వేడుకున్నాడు.
● రఘునాథపల్లికి చెందిన షబానా కుమారుడు జహంగీర్ (6) పుట్టుకతోనే కాళ్లు, చేతులు పని చేయవని, దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా... రావడం లేదని వేడుకుంది.
● జనగామ పట్టణంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకా ణాలు వెలిశాయని, తక్షణమే చర్యలు తీసుకోవా లని పట్టణ వాసులు ఫిర్యాదు చేశారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న తల్లిదండ్రుల పేరు పులిగిల్ల మాధవి, నవీన్. జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామం. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు నిహాల్(6) కాళ్లు, చేతులు, చాతి పని చేయకుండా జన్మించాడు. నడవలేడు, కూర్చోలేడు. సదరం సర్టిఫికెట్ కోసం ఇప్పటి వరకు 25 సార్లు స్లాట్ బుకింగ్ చేసినా ఫలితం దక్కలేదు. కూలిపని చేసుకుంటూనే పూట గడిచే పరిస్థితి. ప్రభుత్వం పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న కాలియ నరసమ్మ తన ఒడిలో చిన్నారి పాప సుజాత(7)ను తీసుకుని కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌కు తీసుకు వచ్చింది. రఘునాథపల్లి మండలం బానాజీపేట శివారు పిట్టలగూడెం. పాప పుట్టుకతోనే కా ళ్లు, చేతులు ముడుచుకోలేవు. ఎప్పుడూ నిటా రుగానే ఉంటుంది. సుజాత పుట్టిన ఏడాదికే సదరం సర్టిఫికెట్ వచ్చింది. పింఛన్ కోసం ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా.. రావడం లేదు. భర్త లక్ష్మయ్య పనికి వెళ్తూ బిడ్డ వైద్యం కోసం ప్రతీ నెల రూ.3 వేలు ఖర్చు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
పింఛన్ల కోసం దివ్యాంగుల గోస
సదరం సర్టిఫికెట్లు ఉన్నా..పింఛన్లు రావు
రఘునాథపల్లి వాసులే ఎక్కువ
కలెక్టర్‌తో సమస్యలను
ఏకరువు పెట్టుకున్న ప్రజలు
ప్రజావాణిలో 75 వినతులు
వరి నార్లు ఎండుతున్నయ్..
జనగామ మండలం చీటకోడూరు రిజర్వాయర్ పక్కనే 2 వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని, దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. భూగర్భ జలాలను పెంచేందుకు చీటకోడూరు–యశ్వంతాపూర్ వాగుపై రూ.11 కోట్లు ఖర్చు చేసి నాలుగు చెక్ డ్యాంలను నిర్మించారన్నారు. తక్షణమే దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు యాదగిరి, సోమిరెడ్డి, కనకరెడ్డి, శివశంకర్, భాస్కర్‌రెడ్డి, రాములు, రవి, వెంకటేశ్వర్లు, తిరుపతి తదితరులు కలెక్టర్‌కు విన్న వించుకున్నారు.

నడవలేరు.. కూర్చోలేరు..

నడవలేరు.. కూర్చోలేరు..

నడవలేరు.. కూర్చోలేరు..