
కాటేసిన కరువు!
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025
కరుణించని వరుణుడు.. ముందుకు కదలని సాగు
– 10లోu
జనగామ: ముప్పై ఏళ్ల నాటి కరువు మళ్లొచ్చింది. వర్షాభావ పరిస్థితులతో చెరువులు, కుంటలు, వాగులు ఎండిపోయాయి. పది మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు, బావుల్లో చుక్కనీరు కనిపించడం లేదు. పొలంమడులు నెర్రెలు బారితే, నార్లు ఎండిపోతున్నాయి. పత్తి విత్తులు మట్టిలో మురిగిపోతుంటే, మొక్కజొన్న చేను వాలిపోతుంది. వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడులు మిగలని పరిస్థితి. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపక పోవడంతో వానాకాలం సీజన్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది.
632 మిల్లీమీటర్లు వర్షపాతం
ఖరీఫ్ సీజన్ మొదలై రెండున్నర నెలలు గడిచి పోతున్నా.. ఇప్పటి వరకు ఒక్క ఎకరా ఆయకట్టుకు సాగు నీరు అందించలేదు. జిల్లాలో జూలై మాసంలో 1,120 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 632 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 44 మిల్లీ మీటర్ల మేర మైనస్‌లో ఉంది. ప్రస్తుతం నావబుపేట, కన్నెబోయినగూడెం రిజర్వాయర్లలో 10శాతం నీటి నిల్వలకు పడిపోగా, ఆర్‌ఎస్‌ఘన్‌పూర్, తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లలో 50లోపు, మిగతా ప్రాజెట్ల పరిధిలో 50శాతంకు పైగా నీరు ఉంది.
ఎండుతున్న నార్లు.. మొలకెత్తని పత్తి
వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో నారు, నాట్లు, పత్తి మొలకలు ఎండుతున్నాయి. ఒక్కో ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు నిండా మునిగిపోతున్నారు. బోర్లు ఒట్టిపోవడంతో మొదటి మడికి సైతం తడి అందించలేకపోతున్నారు. దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లి, నర్మెట, జఫర్‌గఢ్ తదితర ప్రాంతాల్లో వందలాది మంది రైతులు డబుల్ పత్తి విత్తనాలు వేశారు. మూడోసారి వేసుకునే పరిస్థితుల్లో సాగును వదిలేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్‌లో పంటలను కాపాడాలంటే గోదావరి జలాలతో చెరువులను నింపడం ఒక్కటే శరణ్యం.
న్యూస్‌రీల్
మట్టిలో కలిసిపోతున్న పత్తిగింజలు
ఎండుతున్న నార్లు..నాట్లు
వాలిపోతున్న మొక్కజొన్న
జిల్లాలో కరువు ఛాయలు

కాటేసిన కరువు!

కాటేసిన కరువు!