
పాఠశాలల బలోపేతానికి కృషి
తరిగొప్పుల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు చాల్లా తిరుపతిరెడ్డి అన్నారు. టీపీయూఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఉచిత నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ వంటి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. జాతీయ భావజాలంతో పనిచేస్తున్న సంఘాన్ని ఉపాధ్యాయులు ఆదరించి సంఘ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తాటికొండ పెద్దన్న, జిల్లా బాధ్యులు దొంతుల శ్రీనివాస్, పవన్, లలిత, బుడగం సిద్ధారెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
7,604 కొత్త రేషన్
కార్డులు అప్రూవల్
జనగామ: జిల్లాలో సోమవారం ఒక్కరోజే 7,604 రేషన్ కార్డులకు అప్రూవల్ చేశారు. గత నెలలో 2,096 కొత్త రేషన్ కార్డులతో పాటు చేరిక సభ్యులు కలుపుకుని 28,967 మంది లబ్ధిదారులకు మూడు నెలల ఉచిత సన్న బి య్యాన్ని అందించారు. ప్రజాపాలన, మీసేవలో దరఖాస్తు చేసుకున్న సుమారు 36 వేల కుటుంబాల రేషన్ కార్డులకు గ్రీన్‌సిగ్నల్ రానుండగా, ఒకటి, రెండు రోజుల్లో వందశాతం ప్రక్రియ పూర్తి కానుంది. కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల కుటుంబాలకు సెప్టెంబర్ మాసం నుంచి ఉచిత బియ్యం అందించనున్నారు. కార్డులు వచ్చిన వారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
తరిగొప్పుల: చదువుమధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరంలాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కమ్యూనిటీ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో కోఆర్డినేటర్ ఎం.శంకరరావుతో కలిసి ఓపెన్ స్కూల్ పాఠశాలను ప్రారంభించి పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు పైబడిన వారు పదో తరగతి పరీక్షలు రాయ వచ్చన్నారు. అలాగే ఒకే సంవత్సరంలో ఇంట ర్మీడియట్ పరీక్ష రాసి పాస్ కావచ్చన్నారు. మహిళలు, చదువును మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఆసక్తి గల వారు ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు 9988733085 నంబర్‌లో సంప్రదించవ చ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జానకి, మండల కోఆర్డినేటర్ బానోతు వసంత్‌కుమార్, హెచ్‌ఎం బానోతు రవీందర్, ఉపాధ్యాయులు సుమలత, నాగరాణి, అమర్నాథ్, కుమారస్వామి, శ్రీనివాస్, సీఆర్పీలు మహాలక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ ప్రాధాన్యం
హన్మకొండ: ప్రమాదాలు జరుగకుండా ఆర్టీసీ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్ల శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎం డి.విజయభాను మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రమాదాలు లేని వరంగల్ రీజియన్‌గా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ, అద్దె బస్సు, జేబీఎం బస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లు ఏకాగ్రతతో విధులు నిర్వహించాలంటే ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా ఉండడంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నారు. డ్రైవింగ్‌లో సెల్ ఫోన్ మాట్లాడవద్దన్నారు. మద్యం ముట్టుకోవద్దని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేయాలని కోరారు.

పాఠశాలల బలోపేతానికి కృషి

పాఠశాలల బలోపేతానికి కృషి