
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జనగామ రూరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, పాఠశాల స్థాయి నుంచే మొక్కల ప్రాధాన్యంను తెలపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పసరమడ్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమాల్లో సంక్షేమ శాఖకు 500 మొక్కలు నాటాలన్న లక్ష్యం చేరుకోవాలన్నారు. కాలుష్య రహితంగా మారుతున్న పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం గుడ్లు, పప్పుల నిల్వల నాణ్యతను పరిశీలించి గర్భిణులు, బాలింతలను అంగన్‌వాడీ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి ఫ్లోరెన్స్, సీడీపీఓ సత్యవతి, సూపర్‌వైజర్, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్రం కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో మొక్కలు నాటారు.
ఇసుక రవాణా అధిక ధరలకు చెక్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను మన ఇసుక వాహనం యాప్ ద్వారా పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరెట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో మన ఇసుక వాహనంపై అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేష్‌కుమార్‌లతో కలిసి తహసీల్దార్, ఎంపీడీఓలకు హైదరాబాద్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నస్ బృందం సభ్యులు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరం అయ్యే ఇసుకకు సంబంధించిన అధిక ధరలను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా పాలకుర్తి, కొడకండ్ల మండలంలోని ఇందిరమ్మ ఇళ్లకి సూర్యాపేట నుంచి ఇసుకను తెప్పించి తక్కువ ధరలకే రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధిక ధరలను వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఈఈ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లో సంక్షేమ పథకాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్‌ను సన్మానించిన విద్యాశాఖ అధికారులు
న్యాస్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 50 జిల్లాలో జనగామకు చోటుదక్కిన నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషాను డీఈఓ భోజన్న, విద్యాశాఖ అధికారులు సోమవారం సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంచి ఫలితాలు రావడానికి క్షేత్రస్థాయిలో కృషి చేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. అనంతరం కేట్‌కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా