
రోడ్డు పనులకు ఆటంకం కలిగిస్తే ధర్నా చేస్తాం
రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి రెడ్డికాలనీ నుంచి భాంజీపేట వెళ్లేదారిపై చేపట్టిన మట్టి రోడ్డు పనులకు ఆటంకం కలిగించే వారి ఇళ్ల ముందు ధర్నా చేస్తామని గ్రామ రైతులు హెచ్చరించారు. రోడ్డు పనులకు కొందరు అడ్డంకులు కలిగిస్తుండటంపై ఆదివారం గాదె జయపాల్ అధ్యక్షతన బాధిత రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామం నుంచి వ్యవసాయ బావులకు వెళ్లే భాంజీపేట దారికి రోడ్డు కావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించి ఈజీఎస్‌లో రోడ్డు పనులు చేయించారు. మట్టిపై నడిచే పరిస్థితి లేక.. సమస్య ఎమ్మెల్యేకు విన్నవించగా ఆయన వెంటనే స్పందించి కలెక్టర్‌తో మాట్లాడి మొరం పోసుకోవడానికి అనుమతి ఇచ్చారు. 750 ట్రిప్పులకు పర్మిషన్ పొంది ఎకరా చొప్పున తామే నిధులు సమకూర్చుకొని 350 ట్రిప్పులు మాత్రమే మొరం పోసుకున్నామని.. గ్రామానికి సంబంధం లేని వ్య క్తులు అధికారులకు ఫిర్యాదు చేసి పనులు నిలిపి వేయించారన్నారు. స్వచ్ఛందంగా రోడ్డు పనులు చే సుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రాపోలు రామ్మూర్తి, ఓరుగంటి మనోహర్, చిన్నపురెడ్డి, కిరణ్‌రెడ్డి, రాజారెడ్డి, జోజిరెడ్డి, దినేష్‌రెడ్డి, శౌరెడ్డి తదితరులు ఉన్నారు.
కంచనపల్లి రైతులు