
నిర్మాణాల్లో నిబంధనలు తప్పనిసరి
● హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ ప్రీతి
తరిగొప్పుల: ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ ప్రీతి సూచించారు. ఎంపీడీఓ ఆలేటి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ మండలానికి ఎమ్మెల్యే కోటా కింది 62 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సమక్షంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సిందిగా సూచించారు. ఎస్సై గుగులోత్ శ్రీదేవి, ఏపీఎం విజయ, ఎంపీఓ మాలతి, పింగిళి జగన్మోహన్‌రెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్‌గౌడ్, చిలువేరు లింగం,బూస యాదగిరి, ముద్దసాని వెంకట్‌రెడ్డి, సాయిల్ల రాజు, రాచకొండ సంపత్,మర్రికుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ
నర్మెట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుక్రవారం ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి మంజూరు పత్రాలను అందజేశారు. తొలి విడతలో 106 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటాలో ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. నర్మెట–19, ఆగాపేట–6, అమ్మాపురం–7, డీసీ తండా–3, గండిరామారం–6, హన్మంతాపురం–10. గుంటూర్‌పల్లి–3, ఇప్పలగడ్డ–7, ఇసుకబాయితండా–2, కన్నెబోయిన గూడెం–4, లోక్యతండ–3, మచ్చుపహాడ్–8, మల్కపేట–6, మాన్సింగ్‌తండా–7, సూర్యబండతండా–4, వెల్దండ–11, కాగా బొమ్మకూర్ పాయిలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. కార్యక్రమంలో జూనియర్ అస్టిస్టెంట్ రవిందర్, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో..
జనగామ రూరల్: మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్థిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలోని 20 గ్రామ పంచాయితీల్లో ఎంపికై న 119 మంది లబ్ధిదారులకు ఎంపీడీఓ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో జీపీ కార్యదర్శులు లబ్ధిదారులకు అందజేశారు. హౌజింగ్ ఏఈ మఽధు, జూనియర్ అసిస్టెంట్ సృజన పాల్గొన్నారు.