
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోండి
లింగాలఘణపురం: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. మండల కేంద్రంతోపాటు బండ్లగూడెంలో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. బేస్మెంట్ వరకు ఎంత ఖర్చు అయింది.. మహిళా సంఘాల నుంచి ఏమైనా రుణాలు తీసుకున్నారా.. మెరీటీయల్ కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా.. అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మేసీ్త్రలు, కూలీల కొరత ఏమైనా ఉందా.. అని ఆరా తీశారు. ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆయా ఇళ్ల స్థితికి అనుగుణంగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని, ఎలాంటి జాప్యం జరగదని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్‌హౌజ్‌ను పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న సోక్‌ఫిట్స్‌ను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుతో ఎరువుల తనిఖీ చేశారు. ధరల పట్టికల ఏర్పాటు చేయాలని, విత్తనాలు, ఎరువులు విక్రయించే సమయంలో రైతుల పేర్లు, సెల్ నంబర్లను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్‌తోపాటు తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, ఎంపీఓ రాఘురామకృష్ణ, ఏఓ వెంకటేశ్వర్లు, హౌజింగ్ ఏఈ దివ్య, కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, సంతోషిమాత తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్‌బాషా