పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో 50 పడకల సామాజిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణానికి నేడు (సోమవారం) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రూ.17.50 కోట్ల వ్యయంతో ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.
కేంద్ర బృందం పర్యటన
కొడకండ్ల: మండలంలోని ఏడునూతుల గ్రామంలో కేంద్ర స్వచ్ఛ సర్వేక్ష గ్రామీణ్ మిషన్ బృందం ఆదివారం పర్యటించింది. ఎస్‌ఎస్‌జీ రాష్ట్ర పరిశీలకులు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌చార్జ్ శ్రీకృష్ణలు గ్రామంలోని అంగన్‌వాడీ భవనం, మరుగుదొడ్లు, ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించారు. బలహీన వర్గాల, గిరిజన, దళిత నివాసాలను సందర్శించి మరుగుదొడ్ల వినియోగాన్ని పరిశీలించారు. తడిపొడి చెత్త షెడ్లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, స్వచ్ఛత, పరిశుభ్రతలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ కర్ణాకర్, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఎపీఓ కుమారస్వామి, ఎంపీఓ ఇందిర, టీఎ యాకయ్య, ఎఫ్‌ఏ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్యాకోర్సులు
జనగామ రూరల్: విద్యార్థులకు కేవలం సాధారణ విద్యతో పాటు వృత్తి విద్య కోర్సులు ప్రవేశ పెట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 9, 10, ఇంటర్ విద్యార్థులకు ఈ వృత్తి విద్యా కో ర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో శిక్షణ పొందిన వారు ఐటీ, బ్యూటీ వెల్‌నెస్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో 15 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. మల్కాపూర్, స్టేషన్ ఘన్‌పూర్, ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్‌లో మైక్రో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కేజీబీవీ చౌడారంలో బ్యూటీ థెరఫిస్టు, పాలకుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో బ్యూటీ థెరఫిస్టు, ప్లంబింగ్, తరిగొప్పుల జెడ్పీహెచ్‌ఎస్‌లో బ్యూటిథెరఫిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, జఫర్‌గఢ్ సో షల్ వెల్ఫేర్‌లో మిషన్ ఆపరేటర్, హోమ్ హెల్త్, కూనూర్ జెడ్పీఎస్‌ఎస్‌లో బ్యూటిథెరఫిస్టు, డా టా ఎంట్రీలో శిక్షణ ఇవ్వనున్నారు.
మెడికల్ యజమానుల కమిటీ ఎన్నిక
జనగామ: ది జనగామ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలో సంఘ ఎన్నికల నేపధ్యంలో మూడు పోస్టులకు ఆసక్తి ఉన్న వారి నుంచి నామినేషన్లను కోరారు. పోటీ లేకపోవండతో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా బడుగు అంజనేయులు, ప్ర ధాన కార్యదర్శిగా బుక్కబాల భరద్వాజ్, కోశాధికారిగా కొలుపుల యాదగిరి ఎన్నికయ్యారు. ఎన్నికల కమిటీ సభ్యులు మేకపోతుల అంజనేయులు, లగిశెట్టి కృష్ణమూర్తి, పాము పాండరి తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది కిలోల కణతి తొలగింపు
జనగామ: జనగామ పట్టణం హైదరాబాద్‌రోడ్డులోని రవళి నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ రాజమౌళి ఆదివారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. స్కానింగ్ ద్వారా పెద్ద కణతి ఉన్నట్లు నిర్ధారించుకుని, శస్త్ర చికిత్స ద్వారా 9 కిలోల బరువు ఉన్న కణతిని తొలగించారు. క్రిటికల్ ఆపరేషన్ల సమయంలో పరేషన్ చేసి, యువతి ప్రాణాలను కాపాడడంతో పా టు రికార్డు సృష్టించిన డాక్టర్ రాజమౌళిని ప లువురు అభినందించారు. శస్త్ర చికత్సలో వైద్య సిబ్బంది అలిసేరి శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్, రమేశ్ తదితరులు ఉన్నారు.