
మట్టిరోడ్లు.. మస్తు తిప్పలు
జనగామ: జనగామ పట్టణ సమగ్రాభివృద్ధి కోసం ఏటా బడ్జెట్ పేరిట అంకెల గారెడీ తప్ప.. ఆచరణలో చూపించడం లేదు. రోజురోజుకూ విస్తరిస్తు న్న పురపాలిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విస్తరణకు తగినట్టుగా ప్రణాళిక రూపొందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బాలాజీనగర్, ప్రెస్టన్ ఏరియా, బాణాపురం, జ్యోతినగర్, శ్రీ విల్లాస్ కాలనీ, 60 ఫీట్లరోడ్డు, వికాస్‌నగర్, దుర్గమ్మకాలనీ తదితర ప్రాంతాలు నేటికీ సీసీరోడ్డు నిర్మాణానికి నోచు కోవడం లేదు. చిన్న పాటి వర్షానికే మట్టిరోడ్లు చిత్తడిగా మారి కాలినడక కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడిచి పోతున్నా మట్టి రోడ్లపైనే రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 20 కిలోమీటర్ల మేర సీసీరోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. రూ.75కోట్ల మేర బడ్జెట్ అవసరం. సోమవారం పట్టణంలోని పలు కాలనీలను ‘సాక్షి’ సందర్శించిగా మట్టిరోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వెలుగుచూశాయి.
ఫై ఫొటోలో కనిపిస్తున్న వీధి ప్రెస్టన్ స్కూల్ శ్రీసాయి రెసిడెన్షి సమీప కాలనీలోనిది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా సీసీ రోడ్డుకు మోక్షం కలగడం లేదు. చిన్నపాటి వర్షానికే వీధి గుంతల మయంగా మారిపోతుంది. వరద నీరంతా ఇళ్ల ముందే నిలిచి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొని కాలనీ వాసులు కష్టాలు పడుతున్నారు. పట్టణంలోని అనేక కాలనీల్లో పరిస్థితి ఇలానే ఉంది.
ప్రధాన రోడ్డును పట్టించుకోండి
బాలాజీనగర్ మూడు వార్డులకు అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 14వేల జనాభాకు పైగా ఉంటారు. కెనరా బ్యాంకు లైన్‌లో వందలాది ఇళ్లతో అటాచ్ ఉన్న ఈ కాలనీకి సీసీరోడ్డు లేకపోవడం.. మట్టిరోడ్డుతో అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం సీసీకి నోచుకోవడం లేదు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, బురద, ఉబికి వస్తున్న డ్రెయినేజీ నీటితో కాలనీ అపరి శుభ్రంగా మారిపోతున్నది.
ఏళ్ల తరబడి నోచుకోని సీసీరోడ్లు
కాలనీలకు వెళ్లాలంటే నరకమే
పట్టణ దారులన్నీ గుంతల మయం

మట్టిరోడ్లు.. మస్తు తిప్పలు

మట్టిరోడ్లు.. మస్తు తిప్పలు