
తిరుగుడే.. సమస్యలు తీరేదెప్పుడు..?
జనగామ రూరల్: సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేసి తిరుగుడే తప్ప వాటికి పరిష్కా రం లభించడంలేదని ప్రజలు వాపోయారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై ప్రజలు 59 వినతులు అందజేశారు. వాటిని కలెక్టర్ రిజ్వాన్ బాషాతోపాటు అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్ స్వీకరించారు. వినతులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసిన కలెక్టర్.. త్వరితగతిన సమస్యలను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఆర్‌డీఓ తదితరులు పాల్గొన్నారు.
పక్క ఫొటోలోని డి.సుశీల, కొమురయ్య వృద్ధ దంపతులది రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామం. సుశీల పేరు మీద 303బైఏ సర్వే నంబర్‌లో 3 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. వారికి నలుగురు ఆడపిల్లలు. ఎకరం భూమి తన పేర పట్టా చేయాలని పెద్ద కూతురు అడగ్గా సరేనన్నారు. ఆమె నమ్మించి ఉన్న భూమి మొత్తం అక్రమంగా పట్టా చేసుకుంది. ‘తమ బతుకు దెరువుకు ఆధారం లేదు.. న్యాయం చేయాలని’ వృద్ధ దంపతులు కలెక్టర్‌ను వేడుకున్నారు.
గ్రీవెన్స్‌లో అర్జీదారుల ఆవేదన
వివిధ సమస్యలపై 59 వినతులు
స్వీకరించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు

తిరుగుడే.. సమస్యలు తీరేదెప్పుడు..?