
రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది..
తమ ఇంటి దారిలో మట్టిరోడ్డు ఎత్తు పల్లాలుగా ఉంది. వర్షం కురిస్తే నీరంతా ఒకేచోట చేరి రోడ్డును ముంచేస్తున్నది. ఇంటి కి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సీసీ రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుంది.
– కిరణ్, శ్రీవిల్లాస్ కాలనీ
శివారు కాలనీల అభివృద్ధిపై
దృష్టి పెట్టండి..
వికాస్‌నగర్, దుర్గమ్మ కాలనీ లోని అనేక ప్రాంతాల్లో నేటికీ సీసీ రోడ్ల నిర్మాణం లేదు. కనీసం డ్రెయినేజీల పనులు కూడా చేపట్టలేదు. పురపాలిక అధికారులకు ఈ కాలనీలు అంటే పట్టింపు లేదు. వీధి దీపాలు కూడా వెలగడం లేదు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మట్టిరోడ్లతో ఇబ్బంది తప్పేలా లేదు.
– తొట్టె క్రిష్ణ, దుర్గమ్మకాలనీ
జ్యోతినగర్ కాలనీని పట్టించుకోండి
జ్యోతినగర్ ప్రధాన రోడ్డుపై సీసీ వేయాలని ఏళ్ల తరబడి విన్నవించుకుంటున్నాం. వర్షాకాలంలో రోడ్డు ఎంట్రెన్స్‌లో బురదమయమై మట్టి బంకలా మారడంతో జనం జారి పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది.
– వలబోజు సత్యనారాయణ, జ్యోతినగర్

రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది..

రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది..